VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Bhindi Capsicum Curry

బెండ కాప్సికం కూర


బెండకాయలు పది పన్నెండు వెల్లుల్లి (ముక్కలుగా చేసి) ఒక టీ స్పూను అల్లం (ముక్కలుగా చేసి) ఒక టీ స్పూను పచ్చిమిర్చి ఐదు కాప్సికం ఒకటి సోయాసాస్‌ ఒక టేబుల్‌ స్పూన్‌ కార్న్‌ ఫ్లోర్‌ ఒక టేబుల్‌ స్పూన్‌ వినెగర్‌ రెండు టీ స్పూన్లు అజినామోటో కొంచెం ఉల్లికాడలు రెండు నూనె మూడు టీ స్పూన్లు ఉప్పు చక్కెర తగినంత. ఎలా చేయాలి

  • బెండకాయల్ని రెండు వైపులా కట్‌ చేసి రెండేసి ముక్కలుగా కోసుకోండి. సగం కార్న్‌ఫ్లోర్‌, సగం సోయాసాస్‌లలో ఉప్పు వేసి పలచగా కలుపుకోవాలి.

  • దీనిలో బెండకాయ ముక్కలు వేసి పొయ్యి మీద పెట్టి బంగారు రంగు వచ్చే వరకూ వేగిం చండి. పచ్చి మిర్చి, కాప్సికంలను కోసుకుని గింజలు తీసేయండి.

  • బాండలిలో మూడు టీస్పూన్ల నూనె వేశాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేగించండి. తర్వాత మిర్చి, కాప్సికం ముక్కలు వేసి మరో నిమిషం వేగించండి. మిగిలిన సోయాసాస్‌ వేసి మరో రెండు నిమిషాలు వేగించండి.

  • తర్వాత ఒక కప్పు నీళ్ళు, ఉప, కొంచెం చక్కెర, అజీనామోటో వేసి బాగా కాగనివ్వండి. తర్వాత బెండముక్కలు వేసి ఒక నిమిషం ఉడికాక, మిగతా కార్న్‌ఫ్లోర్‌ కొద్దిగా నీళ్ళలో కలిపి పోయండి.

  • ఇది ఫ్రైడ్‌ రైస్‌తో కలిపి తింటే బాగుంటుంది.

  • చిక్కబడ్డాక దించి వినెగర్‌ కలిపి, ఉల్లికాడ ముక్కల్ని పైనజల్లి వడ్డించండి.

No comments:

Post a Comment