మసాలా కాకర |
పొడవు కాకరకాయలు -4 వేగించడానికి తగినంత నూనె కాకరకాయల్లో కూరడానికి: ధనియాల పొడి - టేబుల్ స్పూను జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు పంచదార - 3 టేబుల్ స్పూన్లు మామిడికాయ గుజ్జు - అరకప్పు పొడి బెల్లం - 2 టీ స్పూన్లు జీడిపప్పుపొడి - 3 టేబుల్ స్పూన్లు
కాకరకాయలకు తొక్కపైని బుడిపెలు గీరేసి మధ్యలో నిలువుగా గాటు పెట్టి చీల్చి లోపలి గింజల్ని తీసేయాలి.
ఉప్పు కలిపిన నీటిలో వీటిని మూడు నిమిషాల పాటు ఉడికించాలి. మరో నాలుగు నిమిషాలు ఆ నీటిలోనే ఉంచి తీసి శుభ్రమైన గుడ్డతో కాయల్ని నీరు లేకుండా బయటా లోపలా తుడవాలి.
కూరడానికి తయారుచేసుకుని ఉంచుకున్న ముద్దను చీరిన కాకరకాయల్లో పెట్టి మూసేయాలి. మూకుడులో నూనె వేడెక్కాక కాయను అన్ని వైపులా దోరగా వేగించుకోవాలి.
ఈ కూర అన్నంతో కలుపుకున్నా , విడిగా నంజుకున్నా చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment