సొరకాయ ఆవపెట్టి కూర |
సొరకాయ ముక్కలు - రెండుకప్పులు పుట్నాలు - మూడు టీ స్పూన్లు కొబ్బరి ముక్కలు - అరకప్పు పచ్చిమిర్చి - 4 ఆవాలు - 1 టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత.
సొరకాయ ముక్కల్లో ఉప్పు కలిపి కొద్ది నీళ్లు చల్లి చిన్నమంటపై మగ్గించాలి.
కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి కలిపి పేస్టు చేసి ఉడుకుతున్న సొరకాయ ముక్కల్లో వేసి నీరు ఇగిరిపోయే వరకు ఉంచి దించేయాలి. చల్లారిన తర్వాత నూరుకున్న ఆవ ముద్ద కలపాలి.
No comments:
Post a Comment