సొరకాయ గుజ్జు కూర |
సొరకాయ లేతది సగం చెక్క పెద్ద ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి 4 వేరుశెనగపప్పు 1 గరిటె ధనియాలు 2 స్పూన్లు జీలకర్ర అరస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అరస్పూను కొంచెం పసుపు ఆయిల్ 2 గరిటెలు ఉప్పు 1 స్పూను కారం 1 స్పూను.
సొరకాయ తొక్కతీయకుండా ఫోర్కుతో పైన రంధ్రాలు చిన్నవి పెట్టాలి. పెద్ద ముక్కలు కోసి, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు రాసి బాండీలో నూనెకాగాక కొంచెం కొంచెం వేసి వేయించాలి.
దోరగా వేగిన తరువాత తాలింపువేసి ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగాక సొర ముక్కలు వేసి ఒక గ్లాసు నీళ్ళు, ఉప్పు కారం వేసి ఉడక నివ్వాలి.
దించబోయే ముందు వేరుశనగ పప్పు దనియాలు, జీలకర్ర కొంచెం బెల్లం, వెల్లుల్లి పేస్టు వేసి గరిటె జారుడుగా అయ్యేదాకా ఉంచాలి. పుల్కాలలో కూడా బాగుంటుంది.
No comments:
Post a Comment