వంకాయ బుర్జీ |
వంకాయ - 1 ఉల్లి తరుగు - అర కప్పు టమోటా ముక్కలు - 1 కప్పు ఆలు - 1 పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను పసుపు - చిటికెడు కారం - 1 టీ స్పూను దనియాలపొడి - ఒకటిన్నర స్పూను (వేగించిన) జీరాపొడి - పావు టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత జీలకర్ర - అర టీ స్పూను కరివేపాకు - 4 రెబ్బలు నూనె -2 టీ స్పూన్లు కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను.
వంకాయ చుట్టూ (నాలుగు చుక్కల) నూనె రాసి మంటపై తిప్పుతూ కాల్చాలి. చల్లారిన తర్వాత పై తొక్క తీసి మెదిపి పెట్టుకోవాలి.ఆలుని కూడా ఉడికించి తొక్కతీసి సన్న ముక్కలుగా తరగాలి.
కడాయిలో నూనె వేసి జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టి, ఉల్లి పచ్చిమిర్చి తరుగు వేసి వేగాక టమోటా ముక్కలు వేయాలి.
అవి మెత్తబడ్డాక పసుపు, కారం, దనియాలపొడి, ఉప్పు కలిపి ఒక కప్పు నీరు పోయాలి.
5 నిమిషాలయ్యాక వంకాయ గుజ్జు, ఆలు ముక్కలు వేసి మరికొంత సేపు ఉంచి కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి.
ఈ కూర చపాతీ, పరాటాల్లోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment