కొత్తిమీర గుత్తివంకాయ |
లేత వంకాయలు - అరకిలో కొత్తిమీర తరుగు - 2 కప్పులు పచ్చిమిర్చి 4 (మెత్తని) ఉప్పు - రుచికి సరిపడా నూనె - వేగించడానికి తగినంత.
కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి ముద్దలా నూరుకోవాలి.
వంకాయల్ని గుత్తివంకాయ కోసం కోసుకున్నట్టు నాలుగు గాట్లు పెట్టుకోవాలి.
కొత్తిమీర మిశ్రమాన్ని ఆ గాట్లల్లో కూరి నూనెలో సన్నని సెగమీద వంకాయంతా ఉడికేలా వేగించుకోవాలి.
ఇవి అన్నంతో నంజుకోడానికి చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment