క్యాబేజీ పొడికూర |
క్యాబేజీ తరుగు - 3 కప్పులు శనగపిండి - 1 టేబుల్ స్పూను కారం - 1 టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను మసాలాపొడి - అర టీ స్పూను పసుపు - చిటికెడు నూనె - వేగించడానికి సరిపడా. ఉల్లితరుగు (పొడుగ్గా సన్నగా ఉండాలి) - 1 కప్పు కరివేపాకు - అరకప్పు.
ఒక పాత్రలో శనగపిండి, వెల్లుల్లి పేస్టు, కారం, మసాలాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులోనే కాబేజీ తరుగు కూడా వేసి శనగపిండి మిశ్రమం కాబేజీకి పట్టేట్టుగా కలపాలి. అవసరమైతే కొద్ది నీటిని వాడొచ్చు.
ఈ ముద్దని అరగంటపాటు నానబెట్టి తర్వాత నూనెలో పలచగా, విడివిడిగా పకోడీల్లా వేసి (గట్టిపడేదాకా) వేగించి, తీసి చల్లారనివ్వాలి.
తర్వాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తాలింపును ఇందులో కలుపుకోవాలి.
ఈ పొడికూర పప్పన్నం, సాంబారుల్లో నంజుకోడానికి బాగుంటుంది.
No comments:
Post a Comment