VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Chinese Paneer Curry

చైనీస్‌ పనీర్‌ కర్రీ


పనీర్‌ - వంద గ్రా. నూనె - 2 టేబుల్‌ స్పూన్లు ఉల్లిపాయ - 1 క్యాప్సికం - 1 మైదా - పావు కప్పు.

సాస్‌ తయారీకి

సోయా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను టమోటో సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు వెజిటెబుల్‌ స్టాక్‌ - ఒకటిన్నర కప్పు మెదిపిన వెల్లుల్లి రేక - 1 కారం - అర టీ స్పూను మిరియాల పొడి - 1 టీ స్పూను బ్రౌన్‌ షుగర్‌ - 1 టీ స్పూను వెనిగర్‌ - 1 టీ స్పూను టమోటో గుజ్జు - 2 టేబుల్‌ స్పూన్లు (ఇవన్నీ ఒక పాత్రలో కలుపుకుని ఉంచుకోవాలి)

  • పనీర్‌ ముక్కలను మైదా జారులో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. నూనెలో ఉల్లి, క్యాప్సికం ముక్కల్ని వేగించాలి.

  • ఇప్పుడు కలుపుకున్న సాస్‌ వేసి చిన్న మంటపై 5 నిమిషాలు (కలుపుతూ) ఉడికించాలి. సాస్‌ చిక్కబడ్డాక పనీర్‌ ముక్కలు వేయాలి.

  • చివర్లో ఉప్పు, మిరియాలపొడి కలపాలి. మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీరు పోసి కొద్దిసేపు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి.

  • చపాతీ, పరాటాలతో చాలా రుచిగా ఉండే చైనీస్‌ కర్రీ ఇది.

No comments:

Post a Comment