దహీ బేంగన్ |
వంకాయలు - 200 గ్రా. పెరుగు - పావు కిలో శనగపిండి - 50 గ్రా. ఉప్పు - రుచికి తగినంత నూనె - సరిపడా ఆవాలు - 1 టీ స్పూను కరివేపాకు - 4 రెబ్బలు ఇంగువ - పావు టీ స్పూను ఎండు మిర్చి - 2 కారం - పావు టీ స్పూను.
వంకాయల్ని పొడుగ్గా తరగాలి. శనగపిండిలో చిటికెడు ఉప్పు, కారం వేసి బజ్జీల పిండిలా కలపాలి.
ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి.
తర్వాత పెరుగు, ఉప్పు కలిపిన పాత్రలో ముక్కల్ని వేయాలి. ఇప్పుడు తాలింపును ముక్కల పెరుగులో కలపాలి.
ఈ కర్రీ రోటీతో బాగుంటుంది.
No comments:
Post a Comment