దహీ పనీర్ |
పనీర్ 100 గ్రాములు పెరుగు 50 గ్రాములు పచ్చిమిర్చి 25 గ్రాములు జీడిపప్పు ముద్ద 25 గ్రాములు అల్లం వెల్లుల్లి ముద్ద 5 గ్రాములు గరం మసాలా; సామాను 5 గ్రాములు జీలకర్ర పొడి 5 గ్రాములు యాలకుల పొడి పావు టీ స్పూను రిఫైండ్ ఆయిల్ ఒక టీ స్పూను వెన్న 10 గ్రాములు ఉప్పు చక్కెర తగినంత.
కడాయిలో నూనె వేసి వేడి చేశాక గరం మసాలా వస్తువులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించండి. తర్వాత జీడిపప్పు ముద్ద, పెరుగు వేసి నూనె పైకి తేలేదాకా వేగించండి.
పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేయండి. మిగతా మసాలా కూడా వేసి అవసరమైతే కొంచెం నీళ్ళు పోసి ఉడికించండి. క్రీం, కొత్తిమీర చివర్లో వేసి దించేయండి.
No comments:
Post a Comment