దొండకాయ మసాలా కర్రీ |
దొండకాయలు - 40 టమోటాలు - 2 కరివేపాకు - 4 రెబ్బలు కొత్తిమీర తరుగు - అరకప్పు బ్రౌన్ షుగర్ - 1 టేబుల్ స్పూను నూనె - 1 టేబుల్ స్పూను (వేగించిన) వేరుశనగపప్పు పొడి - అరకప్పు కారం - 1 టీ స్పూను ఆమ్‌చూర్ పొడి - 1 టీ స్పూను నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు గసగసాలు - 1 టేబుల్ స్పూను దనియాలు - 1 టేబుల్ స్పూను మెంతులు - 1 టీ స్పూను జీలకర్ర - 1 టీ స్పూను బిర్యాని ఆకు - 1 లవంగాలు - 2.
నువ్వులు, గసగసాలు కలిపి వేగించి పొడిచేయాలి. దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోసుకోవాలి. మిగతా మసాల దినుసులను కూడా సన్నమంట మీద వేగించి పొడిచేయాలి.
దొండముక్కల్ని నూనెలో దోరగా వేగించాలి. కడాయిలో 1 టేబుల్‌స్పూను నూనె వేసి కరివేపాకు, టమోటాలు వేగాక కారం, మసాలపొడి దొండముక్కలు కలపాలి.
నువ్వులు, గసగసాలపొడి, బ్రౌన్‌షుగర్, ఆమ్‌చూర్‌పొడి వేసి రెండు నిమిషాల తరాథ్వత కప్పు నీరు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. 5 నిమిషాల తర్వాత వేరుశనగపొడి, మరో పావు కప్పు నీరు, కొత్తిమీర చల్లి నీరు ఆవిరయ్యేవరకు ఉంచి దించేయాలి.
No comments:
Post a Comment