మునక్కాయ గుజ్జుకూర |
మునక్కాయలు (పొడుగువి) - 2 మటన్ - పావుకేజి ఉల్లిపాయ-1 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను పసుపు - అర టీ స్పూను కారం - 1 టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత గరం మసాలపొడి - అర టీ స్పూను నూనె - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు - అర కప్పు.
మునక్కాయల్ని 3 ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా ఉడికించాలి. చల్లారాక కూరగాయలు కోసే కత్తితో ముక్కలకున్న గుజ్జుని వేరుచేసి ఉంచుకోవాలి.
మటన్‌కు ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు చేర్చి బాగా కలిపి అరగంటపాటు ఉంచాలి. ఉల్లిపాయ సన్నగా తరగాలి.
కడాయిలో నూనె వేసి ఉల్లితరుగు దోరగా వేగించి మటన్ మిశ్రమాన్ని వేసి మూతపెట్టి పది నిమిషాలు సన్నని సెగమీద ఉంచాలి.
తర్వాత తగినంత నీరుపోసి ఉడికించాలి. ముక్క మెత్తబడ్డాక మునగగుజ్జుని వేసి మరికొంత సేపు ఉడకనివ్వాలి. దించేముందు మసాలాపొడి, కొత్తిమీర తరుగు వేయాలి.
ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment