మునక్కాయ పొడి కూర |
శుభ్రం చేసిన మునగ ఆకులు - 7 కప్పులు ఉప్పు - రుచికి తగినంత ఆవాలు - 1 టీ స్పూను ఎండుమిర్చి - 3 కరివేపాకు - 4 రెబ్బలు నూనె - 1 టేబుల్ స్పూను.
పేస్టుకోసం:
పచ్చికొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పులు వెల్లుల్లి రెబ్బలు - 5 జీలకర్ర - 2 టీ స్పూన్లు పసుపు - 1 అర స్పూను కారం - 1 టీ స్పూను కరివేపాకు - 4 రెబ్బలు.
కొబ్బరితో పాటు మిగతా పదార్థాలన్నీ కలిపి బరకగా పేస్టు చేసుకోవాలి. నూనెలో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మునగ ఆకులు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి చిన్నమంటపై వేగించాలి.
ఆకులు పచ్చివాసన పోయాక కొబ్బరి మిశ్రమం కలిపి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి.
ఈ కూర వేడి అన్నంతో బాగుంటుంది.
No comments:
Post a Comment