మునగాకు వేపుడు |
మునగాకు - 2 కప్పులు ఆవాలు - 1 టీ స్పూను మినప్పప్పు - 1 టీ స్పూను ఎండుమిర్చి - 2 ఇంగువ - అర టీ స్పూను తురిమిన పచ్చికొబ్బరి - 3 టీ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత నూనె - 1 టేబుల్ స్పూను పసుపు - అర టీ స్పూను.
మునగాకుని శుభ్రం చేసి ఆరబెట్టాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేగాక మునగాకు వేసి 3 నిమిషాలు వేగించాలి.
తర్వాత కొన్ని నీళ్లు చిలకరించి మూతపెట్టి సన్నని సెగమీద ఉడికించాలి. పది నిమిషాలయ్యాక కొబ్బరితురుము, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.
ఈ కూర పరాటాల్లోకి, చపాతీల్లోకి బాగుంటుంది.
No comments:
Post a Comment