దమ్‌కీ బెండీ |
బెండకాయలు (చిన్నవి) - 300 గ్రా నెయ్యి - 25 గ్రా ఉల్లిపాయ ఒకటి తరిగినది పావు టీ స్పూను జాజికాయ పొడి. ఉప్పు తగినంత.. లోపల కూరడానికి: నెయ్యి 12 గ్రా. మామిడి పొడి 8గ్రా. ధనియాల పొడి రెండు గ్రా.జీలకర్ర పొడి ఒక గ్రా. నల్లమిరియాల పొడి ఒక గ్రా. కారం ఒక గ్రా. పసుపు ఒక గ్రా. నల్లయాలకుల పొడి ఒక గ్రా.
బెండకాయల తొడిమలు తీసి నిలువుగా చీరుకుని పక్కన పెట్టుకోండి. కూరడానికి ఇచ్చిన పదార్థాలన్నింటినీ కలుపుకుని బెండకాయల్లో సమానంగా కూరుకోండి.
నెయ్యి వేడి చేసి కూరిన బెండకాయలను వేసి మూతపెట్టి ఒక మాదిరి సెగ మీద ఉడికించండి. అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి.
ఐదారు నిమిషాల తరువాత సెగ తగ్గించి అందులో ఉల్లిపాయ ముక్కలు, జాజికాయ పొడి వేసి మూత పెట్టి మరో పదినిమిషాలు వేగించండి.
మధ్యలో తిప్పుతూ ఉడికిన తరువాత దించి ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీరలతో అలంకరించి వడ్డించండి.
No comments:
Post a Comment