ఉసిరి కూర |
పెద్ద ఉసిరికాయలు - అరకేజీ పసుపు - 1 టీ స్పూను కారం- అర టీ స్పూను జీరాపొడి- అర టీ స్పూను ధనియాలపొడి- అర టీ స్పూను ఆవాలు- అర టీ స్పూను మెంతులు - అర టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర - ఒక కట్ట.
ఉసిరికాయలను తొడిమలు లేకుండా శుభ్రపరిచి ఒక రాత్రంతా నానబెట్టాలి.
తర్వాత పసుపు, కారాలతో పాటు తగినంత నీరుపోసి ఉడికించి వార్చాలి. ఉడికిన ఉసిరికాయల పై తొక్కని తీసి ఆరనివ్వాలి.
నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి ఆవాలు, మెంతులు చిటపటమన్నాక తక్కువ సెగమీద ఉసిరికాయల్ని రెండు నిమిషాల పాటు వేగించాలి.
తర్వాత జీరా, ధనియాల పొడులు, ఉప్పు, నిమ్మరసాన్ని కలిపి మరో రెండు నిమిషాలు వేగించాలి. దించేముందు కొత్తిమీరను జల్లాలి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment