![]() |
మరి కొన్ని కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్నమాంసం కూర రుచులు |
కావలసిన పదార్థాలు
*దొండకాయలు - 20
* జీలకర్ర - 1 టీ స్పూను
* శనగపప్పు - 5 టీ స్పూన్లు
* ఎండుమిర్చి -4
* వెల్లుల్లి - 5 రేకలు
* ఉప్పు - రుచికి తగినంత
* నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు. తాలింపు కోసం: ఆవాలు
* జీలకర్ర
* మినప్పప్పు
* కరివేపాకు
* నూనె సరిపడా.
తయారుచేయు విధానం
జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి వెల్లుల్లి, ఉప్పు కలిపి పొడి కొట్టి, ఒక టీ స్పూను నూనె కలపాలి.
దొండకాయలకు (మూడొంతులు) నిలువుగా కత్తితో ‘+ ’ ఆకారంలో గాటు పెట్టి ఈ మిశ్రమం కూరి అరగంట పక్కనుంచాలి.
కడాయిలో నూనె వేడెక్కాక ఈ దొండకాయల్ని సన్నని సెగమీద మగ్గించాలి. తర్వాత మరో కడాయిలో తాలింపు వేసి మగ్గిన దొండకాయల్ని విరక్కుండా వేగించి దించేయాలి.
No comments:
Post a Comment