పనస పిక్కల వేపుడు |
పనస గింజలు - అరకేజి పసుపు - అర టీస్పూను ఎండుమిర్చి - 4 కారం - 1 టేబుల్ స్పూను మిరియాలు - పావు టేబుల్ స్పూను మైదా - 30 గ్రా. నూనె - 50 గ్రా. మినపప్పు - 15 గ్రా. ఆవాలు - 5 గ్రా. జీలకర్ర - 6 గ్రా. ఉప్పు రుచికి తగినంత నీరు - ఒకటిన్నర లీటర్లు.
పనసగింజల్ని ఉడికించి తొక్కతీసి నిలువు నాలుగు ముక్కలు చేసుకోవాలి.
ఎండుమిర్చి, మినపప్పు జీలకర్రలను నూనెలో దోరగా వేగించి పొడి చేసుకొని అందులో పనసగింజలను కలపాలి.
తర్వాత మిరియాలను, ఆవాల్ని పొడి చేసుకొని, మైదా, కారంతో పాటు పనసగింజలకు పట్టించాలి. వీటిని (లోతులేని మూకుడులో) నూనెలో వేగించుకుని అన్నంలో నంజుకుంటే బాగుంటాయి.
No comments:
Post a Comment