పనస స్పైసీ కర్రీ |
పండని పనస తొనలు- 500 గ్రాములు ఉల్లిపాయలు- 2 (పెద్దవి) బంగాళా దుంపలు- 2 (పెద్దవి) అల్లం వెల్లుల్లి పేస్టు- 1 టేబుల్ స్పూను బిర్యానీ ఆకులు- 2 యాలకులు- 4 దాల్చిన చెక్క- అంగుళం ముక్కలు మూడు లవంగాలు- 6 పసుపు- 1 టీ స్పూను దనియాల పొడి- 1 టీ స్పూను కారం- ఒకటిన్నర టీ స్పూను గరం మసాల- 1 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా నూనె- 1 టేబుల్ స్పూను.
పనస తొనలను ముక్కలుగా కోసి, అర టీ స్పూను పసుపు, ఉప్పు రాసి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత కప్పుడు నీళ్ళు పోసి పది నిమిషాలు ఉడికించాక దించి, నీళ్ళు పూర్తిగా వంపేయాలి.
పచ్చి బంగాళా దుంపలు తోలు తీసి ముక్కలుగా కోసి, బాణలిలో నూనె వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.
మిగిలిన నూనెలో మసాలా దినుసులన్నీ వేసి అవి వేగాక, ఉల్లిపాయ ముక్కలు, ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.
ఆ తరువాత, పనస ముక్కలు, బంగాళా దుంపముక్కలు, దనియాల పొడి, కారం, పసుపు చేర్చి బాగా కలిపిమరో రెండు నిమిషాలు వేగించాక, అర కప్పుడు నీళ్ళు పోసి, ఉప్పు వేసి మూత పెట్టి కూర దగ్గర పడేవరకూ ఉడికించాలి.
తరువాత గరం మసాలా కలిపి మరో రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్‌లో ఉంచి దించేయాలి.
No comments:
Post a Comment