VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Kaakara Gutti Koora

కూరిన కాకర


కాకరకాయలు (పొడుగ్గా ఉండాలి) - 6 శనగపిండి - వందగ్రాములు ఎండు కొబ్బరికోరు - 1 కప్పు జీలకర్ర పొడి -1 టీ స్పూను కారం - 1 టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత నూనె - వేగించడానికి సరిపడా.

  • కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచి చివర్ల వరకూ వెళ్లకుండా మధ్యలో పొడుగ్గా (లోతుగా) గాటు పెట్టుకుని గింజలు తీసేయాలి.

  • కడాయిలో కొద్దినూనె వేసి శనగపిండి, ఎండుకొబ్బరికోరు, కారం, జీలకర్ర పొడి వేగించి ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని గాటుపెట్టిన కాకరకాయల్లో కూరాలి (విడిపోకుండా దారం కట్టుకోవచ్చు).

  • కడాయిలో నూనె వేసి 3 కాయల చొప్పున (మూతపెట్టి) సన్నని సెగమీద దోరగా వేగించి, తర్వాత కట్టిన దారం విప్పేయాలి.

  • వీటిని అన్నంతో కలుపుకున్నా, పప్పన్నంలో నంజుకున్నా చాలా బాగుంటాయి.

No comments:

Post a Comment