కడాయి పనీర్ ఫ్రై |
పనీర్ క్యూబ్స్ - 1 కప్పు టమోటా తరుగు - 2 కప్పులు క్యాప్సికం - 1 ఎండుమిర్చి - 5 దనియాలు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను అల్లం తరుగు - 1 టీ స్పూను కొత్తిమీర తరుగు - అరకప్పు నూనె - 1 టేబుల్ స్పూను కసూరీ మేతీ - 1 టీ స్పూను.
క్యాప్సికం సన్నగా నిలువు ముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక, టమోటా తరుగు కలపాలి.
అవి మెత్తబడ్డాక వేగించి, బరకగా మిక్సీ దంచిన ఎండుమిర్చి+ దనియాల పొడి కలపాలి. రెండు నిమిషాల తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి అవి సగం ఉడికాక గరం మసాల, ఉప్పు కలిపి పనీర్ క్యూబ్స్ చల్లాలి.
5 నిమిషాల తర్వాత అల్లం, కొత్తిమీర, కసూరి మేతీ కలిపి దించెయ్యాలి.
ఈ కడాయి పనీర్ కర్రీ పరాటాలతో బాగుంటుంది.
No comments:
Post a Comment