VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Kerala Cabbage Fry

కేరళ క్యాబేజి


రెండు కప్పుల కాబేజి (సన్నగా తరిగి) అర టీస్పూను ఆవాలు ఒక టేబుల్‌స్పూను నూనె రెండు టేబుల్‌స్పూన్ల మినపప్పు (నానపెట్టి) రెండు టేబుల్‌స్పూన్ల తాజా కొబ్బరి (తురిమి) అర టీస్పూను మిరియాల పొడి కరివేపాకులు 8 లేదా 10 ఒక టీస్పూను పచ్చిమిరపకాయ (తరిగి) ఒక ఎండు మిరపకాయలు (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని) ఉప్పు తగినంత కొత్తిమీర (సన్నగా తరిగి) టొమాటొ ముక్కలు.

  • పాన్‌లో నూనెను వేడిచేసి ఆవాలు, కరివేపాకులు, ఎండు మిరప ముక్కలు వేయాలి. వీటిని చిటపటమనే వరకు వేగించి మినపప్పు వేయాలి.

  • కొన్ని నిముషాల తరువాత కాబేజి, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిరియాల పొడి వేయాలి. బాగా కలిపి మూతపెట్టి సన్నని సెగమీద సగం ఉడికే వరకు ఉంచాలి.

  • తరువాత తురిమిన కొబ్బరిని కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. ఫోటోలో చూపినట్టు క్యాబేజీ పైపొరలనే పాత్రగా మలిచి ఈ కూరను అందులో కూరి పెడితే చూడ్డానికి ఇంకా బాగుంటుంది.

No comments:

Post a Comment