VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Mulakkai Teepi Iguru

ములక్కాడ తీపి ఇగురు


ములక్కాడలు - 4 చిన్న ఉల్లిపాయలు - 10 సాంబారు మసాల - 2 టీ స్పూన్లు కరివేపాకు - 4 రెమ్మలు ఆవాలు - పావు టీ స్పూను కారం - అర టీ స్పూను బెల్లం పొడి - 3 టీ స్పూన్లు చింతపండు గుజ్జు - 3 టీ స్పూన్లు నువ్వుల నూనె - 4 టీ స్పూన్లు రుచికి తగినంత ఉప్పు

  • ములక్కాడల్ని 2 అంగుళాల ముక్కలుగా కట్‌ చేసి, ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కనుంచుకోవాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు చిటపటమన్నాక సాంబారుమసాల వేసి ఒక నిమిషం పాటు వేగించాలి.

  • కరివేపాకును, ములక్కాడ ముక్కల్ని వేసి కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి కలపాలి.

  • . రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు నీరు పోయాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి మరో 2 నిమిషాలు ఉడికించి, బెల్లం, కారం, చింతపండు గుజ్జు కూడా కలిపి చిక్కనవగానే దించేయాలి.

No comments:

Post a Comment