VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Onion Drumstick Leaves Curry

ఉల్లి-మునగాకు


మునగాకు - 1 కప్పు పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను కారం - అర టీ స్పూను పసుపు - అర టీ స్పూను పచ్చికొబ్బరి పేస్టు-1 కప్పు ఉల్లి (సన్నని) తరుగు - 2 కప్పులు కరివేపాకు - 4 రెబ్బలు నూనె - 1 టేబుల్‌ స్పూను ఉప్పు - రుచికి తగినంత.

  • పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మునగాకు కలిపి అరకప్పు నీటిలో 10 నిమిషాలు ఉడికించాలి.

  • మునగాకులోనే పచ్చికొబ్బరి పేస్టుని కూడా వేసి మరికొంతసేపు ఉడికించి దించేయాలి.

  • కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగుని (కరివేపాకుతో పాటు) దోరగా వేగించి మునగాకు మిశ్రమాన్ని కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.

  • ఈ కూర అన్నంతో నంజుకోడానికి, పరాటాల్లో తినడానికి బాగుంటుంది. :

No comments:

Post a Comment