పాల వంకాయ |
(బాగా లేత) వంకాయలు - అరకిలో కరివేపాకు - 4 రెబ్బలు నూనె - 1 టేబుల్ స్పూను ఉప్పు - రుచికి తగినంత నూనె - 1 టేబుల్ స్పూను పాలు - 1 కప్పు జీలకర్ర + ఆవాలు + మినప్పప్పు - 1 టీ స్పూను. కారం - అర టీ స్పూను.
కడాయిలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టాక సన్నగా తరిగిన వంకాయముక్కలు కూడా వేసి మూతపెట్టాలి.
రెండు నిమిషాల తర్వాత ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. కూర ఉడుకుతున్నప్పుడు పాలు పోసి కదపకుండా మూతపెట్టి సన్నని సెగమీద ఉడకనివ్వాలి. కూర చిక్కబడ్డాక దించేయాలి.
ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment