పాలక్ చోళీ |
కాబూలీ శనగలు - అరకప్పు పాలకూర - 300 గ్రా. జీలకర్ర - పావు టీ స్పూను కారం - 1 టీ స్పూను అల్లం పొడి - అర టీ స్పూను దనియా జీర మసాల పొడులు - అర టీ స్పూను చొప్పున ఉల్లి తరుగు - పావు కప్పు నూనె - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత పెరుగు - అరకప్పు.
శనగలు మునిగే వరకు నీరు పోసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పాలకూరలో కొద్దిగా నీరు పోసి 5 నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి.
కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లితరుగు, జీరా, దనియా, కారం పొడులు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.
తర్వాత పెరుగు, పాలకూర పేస్టు, తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై ఉడికించాలి.
కూర చిక్కబడ్డాక ఉడికించిన శనగలు, గరం మసాలా కలిపి మరో రెండు నిమిషాల తర్వాత దించేయాలి.
ఈ కూర పరాటాల్లోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment