VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Paalak Kofta Curry

పాలకూర కోఫ్తా కర్రీ


తురిమిన పనీర్‌ - 200 గ్రా. స్వీట్‌ లెస్‌ కోవా - 100 గ్రా. ఉడికించిన ఆలు - 3 కిస్‌మిస్‌ - 15 జీడిపప్పు - 8 ఉప్పు - తగినంత అల్లం తురుము - 1 టీ స్పూను మొక్కజొన్నపిండి - 2 టీ స్పూన్లు నూనె - కోఫ్తాలు వేగించడానికి సరిపడా.

గ్రేవీకోసం

పాలకూర - అరకేజీ పంచదార - అర టీ స్పూను టమోటాలు -3 పచ్చిమిర్చి - 1 అల్లం - అంగుళం ముక్క నూనె - 2 టేబుల్‌ స్పూన్లు ఇంగువ - చిటికెడు జీలకర్ర - అర టీ స్పూను కసూరి మేతీ - 2 టీ స్పూన్లు శనగపిండి - 2 టీ స్పూన్లు మీగడ - 2 టేబుల్‌ స్పూన్లు ఉప్పు - తగినంత గరం మసాల - పావు టీ స్పూను నిమ్మరసం - 2 టీ స్పూన్లు.

  • జీడిపప్పు, కిస్‌మిస్‌లను ముక్కలుగా తరగాలి. ఆలు, కోవా, పనీర్‌, మొక్కజొన్నపిండి, ఉప్పు, అల్లం తురుము కలిపి ముద్దలా చేసుకోవాలి (నీరు పోయక్కర్లేదు).

  • మధ్యలో జీడిపలుకులు, కిస్‌మిస్‌ వచ్చేలా పెట్టి నిమ్మకాయంత ఉండలు చేసుకొని నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి.

  • పాలకూరలో పంచదార కలిపి పావు కప్పు నీటిలో 6 నిమిషాలు ఉడికించి, చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. టమోటా, పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలుగా తరిగి పేస్టు చేసుకోవాలి.

  • నూనెలో జీలకర్ర, ఇంగువ, కసూరి మేతీ, శనగపిండి వేగించాలి. టమోటా పేస్టు వేశాక 4 నిమిషాలకు పాలక్‌ పేస్టు కలపాలి.

  • గ్రేవీ బుడగలు వస్తున్నప్పుడు గరం మసాల, నిమ్మరసం చల్లాలి. తర్వాత కోఫ్తా ఉండలపై ఆ గ్రేవీ పోసి మీగడతో అలంకరించాలి.

No comments:

Post a Comment