VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Paalak Paneer Capsicum

పాలక్‌ పనీర్‌ క్యాప్సికం


చిన్న సైజు క్యాప్సికం - 8 నూనె - 1 టేబుల్‌ స్పూను ఉప్పు - 1 టీ స్పూను. నింపడానికి: తురిమిన పనీర్‌ - 1 కప్పు టమోటాలు- 2 ఉల్లిపాయ -1 క్యారెట్‌ - 1 బీన్స్‌ - 7 పచ్చిబఠాణి - గుప్పెడు జీలకర్ర - 1 టీ స్పూను అల్లం - అంగుళం ముక్క పసుపు - అర టీ స్పూను పచ్చిమిర్చి - 3 దనియాలపొడి - 2 టేబుల్‌ స్పూన్లు కొత్తిమీర - 1 కట్ట గరం మసాల - 1 టీ స్పూను నూనె - 1 టేబుల్‌ స్పూను ఉప్పు - రుచికి తగినంత.

  • క్యాప్సికం తొడిమ, గింజలు తీసేసి, ఉప్పు కలిపిన నూనెను లోపలి అంచులకు రాసి ‘ప్రీ హీట్‌’ చేసుకున్న ఓవెన్‌లో 10 నిమిషాలు ఉంచాలి.

  • కడాయిలో జీలకర్ర వేగాక, ఉల్లి, టమోటా, అల్లం, బఠాణి, బీన్స్‌, క్యారెట్‌ తరుగు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఇప్పుడు పొడులన్నీ వేసి అరకప్పు నీటిలో ఉడికించాలి. నీరు ఇగిరిపోయాక పనీర్‌ వేయాలి.

  • రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించేసి, క్యాప్సికంలో కూరి, ఓవెన్‌లో మరో 5 నిమిషాలు ఉంచాలి.

  • అన్నంతో కలుపుకున్నా, నంజుకున్నా చాలా రుచిగా ఉంటాయివి.

No comments:

Post a Comment