పనీర్ బుర్జీ (పొరటు) |
పనీర్ - 300 గ్రా. ఉల్లి తరుగు - 1 కప్పు చిన్న టమోటా - 1 పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్ స్పూను క్యూబ్స్‌గా తరిగిన క్యాప్సికం ముక్కలు - 1 కప్పు పసుపు దనియా పొడి జీలకర్ర - పావు టీ స్పూను చొప్పున నూనె - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర - అలంకరణకు ఉప్పు - రుచికి తగినంత.
పనీర్‌ను తురిమి పెట్టుకోవాలి. నూనెలో జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా తరుగు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఇప్పుడు క్యాప్సికం క్యూబ్స్ వేయాలి.
ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక పసుపు, ఉప్పు, దనియాల పొడి కలపాలి. 2 నిమిషాల తర్వాత పనీర్ తురుము వేసి నీరు ఇంకిపోయే వరకు చిన్నమంటపై ఉంచాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి.
ఈ పొరటు పరాటాలతో బాగుటుంది. ఇష్టమైతే చివర్లో ఒక స్పూను నిమ్మరసం చల్లుకోవచ్చు.
No comments:
Post a Comment