పనీర్ జాల్ ఫ్రేజీ |
తోఫు (సోయా పనీర్) 100 గ్రా. (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పనీర్ 100 గ్రా. (దీన్నీ చిన్న ముక్కలుగా కోసుకోవాలి) పెద్ద టమోటో లేదా ఎర్ర క్యాప్సికం ఒకటి (గింజలు తీసేసి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి) కాలిఫ్లవర్ లేదా బ్రకోలి ఒకటి (చిన్న చిన్న పువ్వులుగా తుంచుకోవాలి) చిన్న కారెట్లు 2 (అగ్గి పుల్లల కంటే కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోవాలి) ఎండు మిర్చి 2 పచ్చిమిర్చి 2 (పొడుగ్గా కోసుకోవాలి) దనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర పొడి అర టీ స్పూను పసుపు పావు టీ స్పూను నిమ్మరసం అర టీ స్పూను ఉప్పు నూనె తగినంత.
తోఫు, పనీర్ ముక్కల్ని మూకుట్లో బ్రౌన్‌రంగు వచ్చేవరకు వేగించండి. మాడకుండా జాగ్రత్త పడండి.
వీటిని పక్కన పెట్టి మూకుట్లో నూనె కొంచెంవేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారెట్, కాలిఫ్లవర్ ముక్కలు, మసాలా పొడులు, తోఫు, పనీర్ ముక్కలు, టమోటో లేదా క్యాప్సికం ముక్కలు ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ వేగించండి.
అన్నీ వేగాక పెద్ద మంటమీద మూడు నాలుగు నిమిషాలు వేగించి దించి నిమ్మరసం పిండి వడ్డించండి.
పూరీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment