VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Paneer Kaju Masala

పనీర్‌ కాజు మసాలా


పనీర్‌- 200 గ్రాములు టొమాటోలు- 2 జీడిపప్పు- 1/4 కప్పు గసగసాల పేస్టు- 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి- 5 ఉల్లిపాయ ముక్కలు-1/2 కప్పు అల్లంవెల్లుల్లి పేస్టు- 1 టీ స్పూను పసుపు- 1/4 టీస్పూను కారం- 1 టీస్పూను గరం మసాల- 1/2 టీ స్పూను వెన్న- 1 టేబుల్‌ స్పూను కొత్తిమీర తురుము- 1 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా నీళ్ళు- 1 కప్పు.

  • జీడిపప్పు, టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి విడివిడిగా పేస్టు చేసుకోవాలి. అంగుళం సైజులో కోసుకున్న పనీర్‌ ముక్కలను, వెన్నలో దోరగా వేగించుకుని, కప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి.

  • తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించి, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, టొమాటో, గసగసాలు, జీడిపప్పు పేస్టులను వరుసగా వేసుకుంటూ ఒక్కో దానినీ వేగించుకోవాలి.

  • తరువాత నీళ్ళతో సహా పనీర్‌ను వేసి, కారం, ఉప్పు, పసుపు వేసి మధ్య మధ్యలో కలుపుతూ పదిహేను నిమిషాలపాటు ఉడికించి గరంమసాల, కొత్తిమీర చల్లి దింపేయాలి.

No comments:

Post a Comment