VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Paneer Pakodi Curry

పనీర్‌ పకోడీ కర్రీ


పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు శనగపిండి - 1 కప్పు బియ్యప్పిండి - పావు కప్పు వంటసోడా - చిటికెడు పసుపు - అర టీ స్పూను కారం - 1 టీ స్పూను నూనె - వేగించడానికి సరిపడా టమోటా ఉల్లి గుజ్జు - అరకప్పు చొప్పున జీలకర్ర - 1 టీ స్పూను గరం మసాల పొడి -1 టీ స్పూను క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు అల్లం పేస్టు - అర టీ స్పూను కొత్తిమీర తరుగు - అర కప్పు.

  • ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, వంటసోడా వేసి తగినన్ని నీళ్లతో చిక్కగా కలపాలి. ఈ జారులో పనీర్‌ క్యూబ్‌లను ముంచి దోరగా వేగించి పక్కనుంచాలి.

  • నూనెలో జీలకర్ర, అల్లంపేస్టు, ఉల్లి, టమోటా గుజ్జు, కారం, పసుపు, గరం మసాల, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు వేగించాలి.

  • తర్వాత కప్పు నీటిని చేర్చి చిక్కబడ్డాక క్రీమ్‌తో పాటు పనీర్‌ పకోడీలు వేయాలి.

  • ఈ కర్రీ పలావ్‌తో, పరాటాలతో కూడా బాగుంటుంది.

No comments:

Post a Comment