VTStyles

Recent Post

Saturday, 10 October 2015

CommonMeal - Curry - Veg - Paneer Tikka Masala

పనీర్‌ టిక్కా మసాల


పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు అల్లం రసం - 1 టేబుల్‌ స్పూను ఉప్పు మిరియాల పొడి - రుచికి తగినంత పెరుగు - 1 టేబుల్‌ స్పూను నూనె - 2 టేబుల్‌ స్పూన్లు టమోటాలు - 3 పచ్చిమిర్చి -1 జీలకర్ర - అర టీ స్పూను ఇంగువ - చిటికెడు బిర్యాని ఆకు - 1 దనియాల పొడి కాశ్మీరీ కారం - 1 టీ స్పూను చొప్పున పసుపు - పావు టీ స్పూను పంచదార - అర టీ స్పూను మొక్కజొన్న పిండి - 1 టీ స్పూను కొత్తిమీర - 1 కట్ట గరం మసాల - పావు టీ స్పూను.

  • పనీర్‌కు అల్లం రసం, ఉప్పు, పెరుగు, మిరియాల పొడి పట్టించి గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. టమోటాలు, పచ్చిమిర్చి కలిపి పేస్టు చేసుకోవాలి. కొద్ది నీటిలో మొక్కజొన్న పిండి జారుగా కలపాలి.

  • ఫ్రిజ్‌ నుండి తీసిన పనీర్‌ గది ఉష్ణోగ్రతకు వచ్చాక చిన్నమంటపై దోరగా వేగించి పక్కనుంచాలి.

  • . అదే కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, బిర్యాని ఆకు, టమోటా గుజ్జు, దనియాలపొడి, పసుపు, కారం, పంచదారను 4 నిమిషాల సేపు వేగించాలి.

  • ఇప్పుడు మొక్కజొన్న పిండి జారు వేసి చిక్కబడ్డాక పనీర్‌ ముక్కలు వెయ్యాలి. 3 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, గరం మసాల కలిపి దించెయ్యాలి.

  • ఈ మసాల కూర బ్రెడ్‌/ అన్నంతో బాగుంటుంది.

No comments:

Post a Comment