పచ్చి బొప్పాయి కూర |
చెక్కు తీసిన బొప్పాయి (క్యూబ్స్) - 3 కప్పులు పచ్చిమిర్చి - 4 పసుపు - అర టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు చిన్న ఉల్లిపాయలు - 4 వెల్లుల్లి రేకలు - 2 ఆవాలు - అర టీ స్పూను ఎండుమిర్చి - 2 కరివేపాకు - 4 రెబ్బలు.
కొబ్బరి, ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి మెత్తని పేస్టు చేసి పెట్టుకోవాలి.
ఒక కప్పు నీటిలో బొప్పాయి ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉడికించాలి.
ముక్కలు ముప్పావు వంతు ఉడికిన తర్వాత కొబ్బరి పేస్టు కలపాలి. కూర చిక్కబడ్డాక దించేసి విడిగా పెట్టిన తాలింపు కలపాలి.
ఈ కూర అన్నంతో బాగుంటుంది.
No comments:
Post a Comment