పచ్చి బొప్పాయి పల్లీ పొడి కూర |
బొప్పాయి ముక్కలు - 2 కప్పులు ఉల్లి తరుగు - అరకప్పు వేగించిన వేరుశనగపప్పు పొడి - ముప్పావు కప్పు కారం - 1 టీ స్పూను పసుపు - పావు టీ స్పూను నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూను జీలకర్ర ఆవాలు - అర టీ స్పూను చొప్పున కరివేపాకు - 4 రెబ్బలు ఇంగువ - చిటికెడు ఉప్పు - రుచికి తగినంత కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను.
నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఉల్లి తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి.
ఇప్పుడు బొప్పాయి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి సన్నని సెగమీద ఉడికించాలి.
ముక్కలు మెత్తబడ్డాక వేరుశనగపప్పుపొడి వేసి ఐదు నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.
ఈ కూర చపాతీ, పరాటాల్లోకి బాగుంటుంది.
No comments:
Post a Comment