పొటాల్స్ వేపుడు |
పొటాల్స్ - పావు కేజీ పచ్చిమిర్చి -2 ఉల్లిపాయలు - 2 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత కారం - అర టీ స్పూను పసుపు - చిటికెడు జీరా పొడి - 1 టీ స్పూను నూనె - 2 టీ స్పూన్లు కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను నువ్వుల పొడి - 1 టేబుల్ స్పూను.
పొటాల్స్‌ని పొడుగ్గా తరగాలి. కడాయిలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేయాలి. ఇప్పుడు పొటాల్స్‌ని వేసి సన్నని మంటపై మగ్గించాలి.
ముక్కలు ముప్పావు భాగం మెత్తబడ్డాక కారం, ఉప్పు, జీరాపొడి వేసి కూర చిక్కబడ్డప్పుడు నువ్వుల పొడి వేసి కొత్తిమీర చల్లాలి.
అన్నంలో కలుపుకోడానికి ఈ కర్రీ బాగుంటుంది.
No comments:
Post a Comment