పొటాల్స్ గుత్తికూర |
పొటాల్స్ - 7 ఉల్లి తరుగు - 1 కప్పు తరిగిన పచ్చిమిర్చి - 2 ఆలూ కోరు - 1 కప్పు అల్లం తరుగు - అర టీ స్పూను కారం - 1 టీ స్పూను ధనియాలపొడి - 1 టీ స్పూను గరం మసాలా - అర టీ స్పూను నిమ్మరసం - 1 టీ స్పూను పసుపు - చిటికెడు ఉప్పు - రుచికి తగినంత నూనె - 2 టేబుల్ స్పూన్లు.
కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేగించి ఉప్పు, గరం మసాల, కారం, పసుపు, దనియాలపొడి వేయాలి.
రెండు నిమిషాల తర్వాత ఆలు కోరు వేసి కలపాలి. ఆలు మెత్తబడ్డాక నిమ్మరసం కలిపి దించేసి పక్కనుంచాలి. పొటాల్స్‌పై తొక్క తీసేసి నిలువుగా గాటు పెట్టి లోపలి గింజల్ని తీయాలి.
ఆలు మిశ్రమాన్ని పొటాల్స్‌లో కూరి మిగతా నూనెలో సన్నని సెగమీద అన్నివైపులా తిప్పుతూ వేగించాలి.
ఇవి అన్నంతో నంజుకుంటే చాలా బాగుంటాయి.
No comments:
Post a Comment