పొట్ల కాయ గుత్తికూర |
పొట్లకాయ - 1 కందిపప్పు - అరకప్పు శనగపప్పు - అరకప్పు ఎండుమిర్చి - 3 ఇంగువ - చిటికెడు కొబ్బరి తురుము - అరకప్పు ఉప్పు - రుచికి తగినంత నూనె - 3 టీ స్పూన్లు ఆవాలు - అర టీ స్పూను.
కందిపప్పు, శనగపప్పు కలిపి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పులతో పాటు రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఇడ్లీల్లా ఆవిరిపై ఉడికించాలి. చల్లారిన తర్వాత చేత్తో మెదిపి ఉంచుకోవాలి.
నూనెలో ఆవాలు తాలింపు వేశాక ఈ మెదిపిన పప్పు, కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాలు వేగించాలి.
పొట్లకాయను 2 అంగుళాల పొడవున (గొట్టాల మాదిరి) ముక్కలుగా చేసుకుని గింజలు తీసి, చిటికెడు ఉప్పు వేసిన నీటిలో 3 నిమిషాలు (మాత్రమే) ఉడికించి తీసెయ్యాలి.
ఈ గొట్టాల్లో పప్పు మిశ్రమం కూరి, నూనె రాసిన పెనంపై అన్ని వైపులా వేగించాలి.
అన్నంతో నంజుకోడానికి బాగుంటాయి.
No comments:
Post a Comment