నువ్వుల పొట్లకాయ |
పొట్లకాయ -1 నువ్వులు - 100 గ్రా. అల్లం - అరంగుళం ముక్క ఉల్లిపాయ - 1 పచ్చిమిర్చి -4 ఉప్పు - రుచికి తగినంత కొత్తిమీర - 1 కట్ట కరివేపాకు - 4 రెబ్బలు నూనె - 3 టీ స్పూన్లు తాళింపు గింజలు - 1 టీ స్పూను పసుపు - చిటికెడు.
పొట్లకాయని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల్ని పెనంపైన దోరగా వేగించి, చల్లారనిచ్చి పొడి చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు కడాయిలో తాళింపు వేసి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేగించి, పొట్లకాయ ముక్కల్ని జతచేసి మగ్గనివ్వాలి.
ముక్కలు మెత్తబడ్డాక అల్లం మిశ్రమాన్ని కలపాలి. మరో ఐదు నిమిషాలు సన్నని సెగమీద ఉంచి, ముక్కలు ఉడికిన తర్వాత నువ్వులపొడి చల్లి, కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment