పొట్లకాయ పనీర్ గుత్తి కూర |
పొట్లకాయ - 1 పనీర్ గుజ్జు - తగినంత ఉప్పు - కొద్దిగా నూనె - రెండు టేబుల్ స్పూన్లు.
పనీర్ గుజ్జు కోసం
పనీర్ తురుము - 2 కప్పులు ఉల్లి క్యాప్సికం తరుగు - అరకప్పు చొప్పున టమోటో గుజ్జు - 1 కప్పు కారం - 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూను గరం మసాలా - అర టీ స్పూను ఎండు మెంతి - చిటికెడు జీలకర్ర - 1 టీ స్పూను పసుపు - చిటికెడు ఉప్పు - రుచికి తగినంత.
పనీర్ గుజ్జు తయారీ కోసం
నూనెలో జీలకర్ర వేగాక ఉల్లి, క్యాప్సికం తరుగు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, మెంతి, టమోటో గుజ్జు వేగించి పనీర్, ఉప్పు కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి.
పొట్లకాయని రెండు అంగుళాల గుండ్రని ముక్కలుగా కట్ చేసి, గింజలు తీసేసి ఉప్పు కలిపిన నూనెను వేలితో లోపలి భాగంలో రాసి, ఓవెన్‌లో మూడొంతులు ఉడికేలా పెట్టి తీసి చల్లారనివ్వాలి.
తర్వాత పనీర్ గుజ్జును కూరి పెనంపై నూనె రాసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. రొట్టెలతో తిన్నా, అన్నంతో నంజుకున్నా బాగుండే వంటకం.
No comments:
Post a Comment