పొట్లకాయ పల్లీపొడి కూర |
పొట్లకాయ - 1 ఉల్లిపాయ తరుగు - అరకప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్ప - అర టీ స్పూను చొప్పున ఉప్పు - తగినంత నూనె - 1 టేబుల్ స్పూను ఎండుమిర్చి - 6 వెల్లుల్లి రేకలు - 6 వేరుశనగ పప్పులు - అరకప్పు కరివేపాకు - 4 రెబ్బలు పసుపు - అర టీ స్పూను ఇంగువ - చిటికెడు కొత్తిమీర తరుగు - అరకప్పు.
పొట్టకాయని ముక్కలుగా తరిగి చిటికెడు పసుపు కలిపి, కప్పు నీటితో ఉడికించాలి (ముక్క సగం ఉడికితే చాలు).
ఎండుమిర్చి, వేరుశనగపప్పులను విడివిడిగా వేగించి వెల్లుల్లితో కలిపి పొడి చేయాలి. నూనెలో తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉల్లితరుగు వేగించి ఉడికిన ముక్కలు కలపాలి.
5 నిమిషాలు మగ్గించి ఉప్పు, వేరుశనగ పొడి మిశ్రమం కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.
No comments:
Post a Comment