పొట్ల కాయ పప్పు కూర |
పొట్లకాయ - పావు కేజీ పచ్చిమిర్చి - 4 పచ్చికొబ్బరి తురుము - అరకప్పు జీలకర్ర - 1 టీ స్పూను శనగపప్పు - అరకప్పు పసుపు - అర టీ స్పూను నూనె - అర టీ స్పూను తాలింపు దినుసులు - సరిపడా.
3 కప్పుల నీటిలో శనగపప్పు, పసుపు, అర టీ స్పూను నూనె వేసి మెత్తగా ఉడికించి పక్కనుంచాలి.
కొబ్బరి తురుములో 3 పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి పేస్టు చేయాలి. ఒక పాత్రలో పొట్లకాయ ముక్కలు, ఉడికిన పప్పు, చీరిన ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి చిన్నమంటపై 10 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు కొబ్బరి పేస్టు వేసి పావు కప్పు నీరు పోసి మూత పెట్టి మరో పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత విడిగా పెట్టిన తాలింపు కలపాలి. వేడి వేడి అన్నంతో బాగుంటుంది.
No comments:
Post a Comment