VTStyles

Recent Post

Sunday, 1 November 2015

CommonMeal - Curry - Veg - Soya Kheema Curry

సోయా కీమా


సోయా గ్రాన్యూల్స్‌ - 2 టేబుల్‌స్పూన్లు తరిగిన టమేటో - 1 తరిగిన ఉల్లిపాయ -1 అల్లం వెల్లుల్లి పేస్టు - అరస్పూను కారం - అరస్పూను ధనియాలపొడి - పావుస్పూను గరంమసాలా - పావుస్పూను పసుపు - పావు స్పూను పెరుగు - 1 టేబుల్‌స్పూను నూనె - 1 టీస్పూను.

  • సోయాగ్రాన్యూల్స్‌ పావుగంటసేపు నీటిలో నానబెట్టి, ఉడికించి నీరు వడకట్టి పక్కనుంచుకోవాలి.

  • కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయముక్కల్నివేసి, అవి బంగారురంగు వచ్చేక అల్లంవెల్ల్లుల్లి ముద్దను వేసి కొద్ది సెకన్లపాటు వేగించాలి.

  • టమోటా ముక్కలు, మిగతా మసాలాలు, పెరుగు వేసి ఇంకో 15 నిమిషాల పాటు వేగించాలి.

  • . తర్వాత పక్కనుంచిన సోయా గ్రాన్యూల్స్‌, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు ఉంచి దించాలి. కొత్తిమీర చల్లి అలంకరించుకోవచ్చు.

  • సోయా కీమా చపాతీల్లోకి బాగుంటుంది.

No comments:

Post a Comment