సోయాబీన్‌తో పాలకూర కర్రీ |
సోయా గ్రాన్యూవల్స్ - 1 కప్పు పాలకూర తరుగు - 2 కప్పులు ఉల్లిపాయ - 1 పచ్చిమిర్చి - 2 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను కారం - అర టీ స్పూను గరం మసాల - అర టీ స్పూను పసుపు - చిటికెడు జీలకర్ర - పావు టీ స్పూను ఉప్పు - రుచికి తగినంత నూనె - 1 టేబుల్ స్పూను.
గోరువెచ్చని నీటిలో గ్రాన్యూవల్స్ నానబెట్టి 5 నిమిషాలయ్యాక నీరు పిండి పక్కనుంచాలి.
నూనెలో జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి.
ఇప్పుడు పాలకూర తరుగు వేసి, కొద్దిగా మగ్గిన తర్వాత సోయా గ్రాన్యూవల్స్ కలిపి మూత పెట్టాలి. 3 నిమిషాల తర్వాత కారం, ఉప్పు, గరం మసాల చల్లి మరో 2 నిమిషాలు ఉంచి దించేయాలి.
ఈ కూర అన్నం, పరాటాలలోకి బాగుంటుంది.
No comments:
Post a Comment