నూల్ కోల్‌తో కొబ్బరి కూర |
నూల్‌కోల్ - 1 ఉల్లిపాయ - 1 టమోటా - 1 పసుపు - చిటెకెడు దనియాల పొడి - 2 టీ స్పూన్లు సోంపు - అర టీ స్పూను కారం - 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను కరివేపాకు - 4 రెబ్బలు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - రుచికి తగినంత నూనె - 2 టేబుల్ స్పూన్లు. పేస్టు కోసం: పచ్చి కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు మిరియాలు జీలకర్ర సోంపు - అర టీ స్పూను చొప్పున పచ్చిమిర్చి - 2.
నూల్‌కోల్‌ను శుభ్రం చేసి ముక్కలుగా తరగాలి. నూనెలో సోంపు, కరివేపాకు, ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేగించి నూల్‌కోల్ ముక్కలు కలపాలి.
రెండు నిమిషాల తర్వాత కారం, దనియాలపొడి, ఉప్పు, పసుపు కలిపి అరకప్పు నీరు పోయాలి. ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బరి పేస్టు మిశ్రమం వేసి 3 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి.
ఈ కూర పరాటాలతో బాగుంటుంది.
No comments:
Post a Comment