నూల్‌కోల్ కుర్మా |
నూల్‌కోల్ ముక్కలు - 2కప్పులు క్యారెట్ బీన్స్ ఆలు కాలీఫ్లవర్ తరుగు - ఒక్కో కప్పు చొప్పున ఉడికించిన కాబూలీ శనగలు - ఒకటిన్నర కప్పు.
మసాల కోసం:
(వేగించి పొడి చేయాలి) గసగసాలు - 3 టీ స్పూన్లు జీలకర్ర - 1 టీ స్పూను బిర్యాని ఆకులు - 2 దాల్చన చెక్క - అంగుళం ముక్క యాలకులు - 2 లవంగాలు - 2. పేస్టు కోసం : ఉల్లితరుగు - అరకప్పు టమోటా - 1 అల్లం - 2 అంగుళాల ముక్క వెల్లుల్లి - 3 రేకలు కొబ్బరి తురుము - అరకప్పు పచ్చిమిర్చి - 4/లేదా కారం - 1 టీ స్పూను (వీటిని నూనెలో వేగించి మసాల పొడితో పాటు మెత్తగా గ్రైండ్ చేయాలి)
నూల్‌కోల్ ముక్కలతో పాటు మిగతా కూరగాయలను (చిటికెడు పసుపు చేర్చి) ఉడికించాలి (కాలిఫ్లవర్ ముక్కలు మాత్రం మిగతావన్నీ సగం ఉడికిన తర్వాత చేర్చాలి).
ఇప్పుడు శనగలు, పేస్టు, అవసరం అనుకుంటే కొద్ది నీరు చేర్చి 10 నిమిషాలు ఉడికించి, కుర్మా చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.
ఇది చపాతీల్లో చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment