నూల్‌కోల్ పెరుగు |
నూల్‌కోల్ - 2 మిరియాలు - అర టీ స్పూను పసుపు - చిటికెడు ఉప్పు - రుచికి తగినంత పెరుగు - 2 కప్పులు పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు పచ్చిమిర్చి - 3 జీలకర్ర - 1 టీ స్పూను తాలింపు దినుసులు - తగినన్ని.
కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్రను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
నూల్‌కోల్ ముక్కల్లో పసుపు, మిరియాలపొడి, ఉప్పు వేసి 3 కప్పుల నీరు చేర్చి నీరు ఇగిరిపోయేవరకు ఉడికించాలి.
తర్వాత పెరుగు, కొబ్బరి పేస్టు వేసి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచి దించేసి, వేరుగా తాలింపు పెట్టి ముక్కల్లో కలపాలి.
No comments:
Post a Comment