ప్రాన్ పత్తా బిరియాని |
రొయ్యలు - 400గ్రా పొల్లిచ మసాలా - 400గ్రా వండిన పులావ్ రైస్ - 800గ్రా అరటి ఆకులు - 4 టైగర్ రొయ్యలు - 400గ్రా కారం - 10గ్రా పసుపు - 5గ్రా ఉప్పు - 10గ్రా నిమ్మరసం - 3 నిమ్మకాయలు కరివేపాకు - 5గ్రా ఉల్లి తరుగు - 80గ్రా పికిల్ - 40గ్రా అప్పడాలు - 4 పొల్లిచ మసాలా: కొబ్బరి నూనె - 100గ్రా ఆవాలు - 10గ్రా మెంతులు - 5గ్రా వెల్లుల్లి తరుగు - 25గ్రా అల్లం తరుగు - 20గ్రా పచ్చిమిర్చి - 10గ్రా కరివేపాకు - 5గ్రా ఉల్లి ముక్కలు - 1 కిలో టొమాటో పేస్ట్ - 400గ్రా ఉప్పు - 10గ్రా కుంకుమ పువ్వు - 15గ్రా పసుపు - 5గ్రా కశ్మీరీ కారం - 15గ్రా ధనియాల పొడి - 20గ్రా ఫిష్ స్టాక్ - 150గ్రా
నూనె వేడిచేసి ఆవాలు, అల్లం, వెల్లుల్లి తరుగు, కారం, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత మసాలాలు వేసి టొమాటో పేస్ట్, ఫిష్ స్టాక్ కూడా వేసి కలపాలి.
నూనె తేలేవరకూ ఉడికించి ఉప్పు, కుంకుమ పువ్వు వేసి దింపాలి. చిన్న రొయ్యలకు పొల్లిచ మసాలా కలిపి పక్కనుంచాలి. కారం, పసుపు, ఉప్పు, తరిగిన కరివేపాకు, నిమ్మరసంలో టైగర్ ప్రాన్స్‌ను నానబెట్టుకోవాలి.
అరటి ఆకులో ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న రొయ్యలు, వాటిపైన ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులావ్, టైగర్ ప్రాన్స్ లేయర్స్‌గా పరచాలి.
తర్వాత అరటి ఆకును నాలుగువైపుల్నుంచీ మడిచి గ్రిల్ మీద కాల్చాలి. అరటి ఆకు నల్లగా తయారై ఆకు వాసన రొయ్యలకు పట్టేంతవరకూ గ్రిల్ చేయాలి. పికిల్, అప్పడాలతో వేడివేడిగా తినేయాలి.
No comments:
Post a Comment