VTStyles

Recent Post

Tuesday, 23 February 2016

Biriyani - Ulavacharu Chicken Biriyani

ఉలవచారు చికెన్ బిర్యాని


బాస్మతీ రైస్‌ చికెన్- ఒక కేజీ చొప్పున ఉలవచారు - అరకిలో నిమ్మకాయలు - రెండు ఉల్లిపాయలు (తరిగి) పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టుపచ్చిమిర్చి (చీలికలు)-150 గ్రాములు చొప్పున పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌స్పూన్లు బిర్యానీ ఆకులు- నాలుగు నెయ్యి - వందగ్రాములు బిర్యాని మసాలా దినుసులు పసుపు - 50గ్రాములు ఉప్పు కారం తగినంత.

  • గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగాక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.

  • . రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పువేసి ఉడికించాలి. వేరొక గిన్నెలో రెండు టీస్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేగించాలి.

  • అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లంవెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు వేగాక అరలీటరు నీళ్లు పోసి ఉడికించాలి.

  • ఆ తరువాత అందులో అరకిలో (తయారుగా ఉన్న) ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొద్దిసేపు ఉడికించాలి.

  • ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే... ఉలవచారు బిర్యాని సిద్ధం.

No comments:

Post a Comment