యాపిల్ మిల్క్‌షేక్ |
యాపిల్స్ - నాలుగు పాలు - రెండు గ్లాసులు జీడిపప్పు పలుకులు - పది చక్కెర - రెండు టేబుల్‌స్పూన్లు యాలకులపొడి - అరచెంచా బాదంపలుకులు - కొన్ని.
యాపిల్స్ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోయాలి. వాటిల్లో గింజలు తీసేసి చక్కెరా, పావు గ్లాసు పాలు తీసుకుని మిక్సీ జారులో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
అలాగే సగం జీడిపప్పును మెత్తని ముద్దలా చేసుకుని. ఇప్పుడు యాపిల్ గుజ్జూ, జీడిపప్పు పేస్టూ, మిగిలిన పాలూ తీసుకుని బాగా కలపాలి.
ఇందులో బాదంపలుకులూ, మిగిలిన జీడిపప్పూ, యాలకులపొడీ వేసి బాగా కలిపి తరవాత గ్లాసుల్లోకి పోయాలి. దీన్ని చల్లగా తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు తాగాలనుకుంటే ఐసుముక్కలు వేసుకోవచ్చు.
No comments:
Post a Comment